జార్ఖండ్ లో రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీ కొట్టిన హౌరా-CSMT ఎక్స్ప్రెస్

జార్ఖండ్ లో రైలు ప్రమాదం.. గూడ్స్  రైలును ఢీ కొట్టిన హౌరా-CSMT ఎక్స్ప్రెస్

జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.  చక్రధర్ పూర్ డివిజన్ లోని రాజ్‌ఖర్స్వాన్ వెస్ట్ ఔటర్ ..బారా బాంబూ మధ్య జూలై 30 తెల్లవారుజామున 3:45 గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో మూడు బోగీలు మరో ట్రాక్ పై ఒరిగాయి.   అదే లైన్ లో   హౌరా- సీఎస్ఎంటీ ఎక్స్ ప్రెస్  రైలు వచ్చి గూడ్స్ రైలు బోగీలను ఢీ కొట్టింది. దీంతో 18 భోగీలు పట్టాలు తప్పాయి. 

  ఘటనా స్థలానికి వచ్చిన రైల్వే అధికారులు గాయాలైన  ఏడుగురు ప్రయాణికులను  స్థానిక ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.