లెక్చరర్ గా అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్

లెక్చరర్ గా అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్

అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైట్‌ హౌస్‌లో ఉంటూ బయట ఫుల్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్న తొలి అమెరికా ప్రథమ మహిళగా రికార్డు సృష్టించారు. 1976 నుంచి టీచర్ వృత్తిలో ఉన్న ఆమె జో బైడెన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే వృత్తిలో కొనసాగుతున్నారు. బైడెన్  2009లో అమెరికా ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత ఆమె నార్తర్న్‌ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా చేరారు. తాజాగా బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా ఉద్యోగాన్ని వదిలిపెట్టలేదు. కాకపోతే కరోనా ప్రభావం ఉంది కాబట్టి  ఇంటి (వైట్‌హౌస్‌) నుంచే వర్చువల్‌ క్లాసుల ద్వారా పాఠాలు చెబుతూ వచ్చారు. 
ఇవాళ్టి నుంచి కాలేజీకి హాజరవుతున్న జిల్ బైడెన్
ఇన్నాళ్లు వర్చువల్ గా నార్తర్న్‌ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీ పిల్లలకు క్లాసులు చెప్పిన అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ ఇవాళ్టి నుంచి కాలేజీకి హాజరు కానున్నారు. 2009 నుంచి నార్తర్న్‌ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ఆమె ఇంగ్లిషు లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు చెబుతూ వచ్చారు. అయితే  ఏడాది తర్వాత జిల్ బైడెన్‌ ఇపుడు ప్రత్యక్షంగా క్లాసులకు హాజరు అవుతుండడంపై సంతోషం వ్యక్తం చేశారు.