బ్రోకరేజ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లోకి జియో ఫైనాన్స్‌‌‌‌

బ్రోకరేజ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లోకి జియో ఫైనాన్స్‌‌‌‌

న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సబ్సిడరీకి సబ్సిడరీ జియో బ్లాక్‌‌‌‌రాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌  కార్యకలాపాలు ప్రారంభించేందుకు సెబీ అనుమతులు పొందింది. ఈ సంస్థ జియో బ్లాక్‌‌‌‌రాక్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌కు  సబ్సిడరీ కంపెనీ. ఇన్వెస్టర్లకు అందుబాటు ధరల్లో, పారదర్శకమైన, టెక్నాలజీ ఆధారిత ఎగ్జిక్యూషన్ సౌకర్యాలను అందించడమే తమ లక్ష్యమని  జియో బ్లాక్‌‌‌‌రాక్ బ్రోకింగ్ ఒక ప్రకటనలో తెలిపింది.  ఇటీవల జియో బ్లాక్‌‌‌‌రాక్ అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్‌, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ అడ్వైజర్స్‌‌‌‌ వ్యాపారాలకు కూడా కార్యకలాపాలు ప్రారంభించడానికి అనుమతులు లభించాయి. ఇప్పుడు బ్రోకరేజ్ లైసెన్స్‌‌‌‌ రావడంతో జియో బ్లాక్‌‌‌‌రాక్ జాయింట్ వెంచర్ సమగ్ర ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ సొల్యూషన్స్ అందించగలుగుతుంది.