JIO Record Break : షేర్లు 14.50 శాతం పెరిగాయ్.. JFS స్టాక్ విలువ 2లక్షల కోట్లు

JIO Record Break : షేర్లు 14.50 శాతం పెరిగాయ్.. JFS స్టాక్ విలువ 2లక్షల కోట్లు

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(JFS) షేర్లు శుక్రవారం (ఫిబ్రవరి 23) తాజా గరిష్ట స్థాయి చేరుకున్నాయి. దీంతో JFS  మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంది. JSW స్టీల్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ , వరుణ్ బేవరేజెస్ లిమిటెడ్ లను అధిగ మించి మార్కెట్ విలువను Jio ఫైనాన్షియల్ ఆదేశించింది.

BSE లో JFSషేర్లు 14.50 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.347 ను తాకాయి. తర్వాత ఈ షేరు 9.12 శాతం పెరిగి రూ. 330.70 వద్ద ట్రేడ్ అయింది. ఈ ధర వద్ద JFS  దాని నిన్నటి రోజు  మార్కెట్ విలువ రూ. 1లక్షా 92వేల 53.28 కోట్లతో పోలిస్తే రూ. 2లక్షల 10 వేల ,325.47 కోట్లుగా ఉంది. 

ఈ మార్కెట్ విలువ IRFC m-క్యాప్ రూ. 2లక్షల 01వేల 516.36 కోట్ల కంటే ఎక్కువ. ఈ షేరు 1.38 శాతం లాభపడి రూ. 154.20 కి చేరుకుంది.JSF  m-cap  కూడా HAL( రూ. 2,04,712.03 కోట్లు), JSW స్టీల్ (రూ. 2,01,982.27కోట్లు), వరుణ్ బేవరేజెస్ లిమిటెడ్ (రూ. 1,96,344.77 కోట్లు) మార్కెట్ విలువలను అధిగమించింది.   అదే సమయంలో Jio ఫైనాన్షియల్.. అదానీ పవర్ m-క్యాప్ రూ. 2,15,217.17 కోట్లకంటే వెనకబడి ఉంది.