నిఫ్టీ ఆల్‌‌‌‌‌‌‌‌ టైమ్ రికార్డ్‌‌‌‌‌‌‌‌.. ఐటీ, ఆటో షేర్లలో భారీగా కొనుగోళ్లు

నిఫ్టీ ఆల్‌‌‌‌‌‌‌‌ టైమ్ రికార్డ్‌‌‌‌‌‌‌‌.. ఐటీ, ఆటో షేర్లలో భారీగా కొనుగోళ్లు

 ముంబై:  బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు గురువారం రోలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోస్టర్ రైడ్‌‌‌‌‌‌‌‌ చేశాయి. ఇంట్రాడేలో ఒక శాతం మేర పతనమైన నిఫ్టీ, చివరికి  సెషన్‌‌‌‌‌‌‌‌ను ఒక శాతం లాభంతో ముగించింది. మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ (62)  ఫిబ్రవరిలో ఐదు నెలల గరిష్టానికి,  సర్వీసెస్  పీఎంఐ (61.5) ఏడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. మాక్రో ఎకనమిక్‌‌‌‌‌‌‌‌  డేటా మెరుగ్గా ఉండడం మార్కెట్‌‌‌‌‌‌‌‌కు కలిసొచ్చింది.  ఐటీ, ఆటో మొబైల్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో  సెన్సెక్స్ గురువారం 535 పాయింట్లు (0.74 శాతం) లాభపడి 73,158 దగ్గర సెటిలయ్యింది. ఒకానొక దశలో 21,875 వరకు పడిన నిఫ్టీ, చివరికి  162 పాయింట్లు లాభంతో   22,217 దగ్గర  ముగిసింది. ఇంట్రాడేలో 22,252.50 లెవెల్‌‌‌‌‌‌‌‌ దగ్గర ఆల్ టైమ్ హైని ఈ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్ నమోదు చేసింది. 

సెషన్ మొత్తం మార్కెట్‌‌‌‌‌‌‌‌ నెగెటివ్‌‌‌‌‌‌‌‌లో కదిలిందని, చివరి గంటలో మాత్రం ఒక్కసారిగా బయ్యింగ్ వచ్చిందని ఎనలిస్టులు పేర్కొన్నారు.  గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా కదలడంతో పాటు  దేశ  ఆర్థికవ్యవస్థ మెరుగ్గా ఉండడంతో  మార్కెట్ దూసుకుపోయిందని చెప్పారు.  మిడ్‌‌‌‌‌‌‌‌, స్మాల్‌‌‌‌‌‌‌‌ క్యాప్ షేర్లు ఇంకా బేర్స్ గుప్పిట్లోనే ఉన్నాయని,  ఓపెనింగ్ సెషన్‌‌‌‌‌‌‌‌లో మార్కెట్‌‌‌‌‌‌‌‌ను కిందకి లాగాయని  ప్రొగ్రసివ్‌‌‌‌‌‌‌‌ షేర్స్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదిత్య గగ్గర్ పేర్కొన్నారు. బ్యాంక్ నిఫ్టీ మినహా మిగిలిన ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు లాభాల్లో క్లోజయ్యాయని, ఐటీ, ఆటో ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా లాభపడ్డాయని అన్నారు. డైలీ చార్ట్‌‌‌‌‌‌‌‌లో నిఫ్టీ పెద్ద గ్రీన్ క్యాండిల్‌‌‌‌‌‌‌‌ను ఏర్పరిచిందని, 23,12‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 లెవెల్‌‌‌‌‌‌‌‌ వైపు కదులుతోందని అంచనా వేశారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌ అండ్ ఓ  వీక్లి ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరి కావడంతో వోలటాలిటీ కనిపించిందని, దిగువన నిఫ్టీకి 21,900 దగ్గర సపోర్ట్ లభించిందని ఎల్‌‌‌‌‌‌‌‌కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ రూపక్ దే అన్నారు. ముమంటం పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా మారిందని, నిఫ్టీ షార్ట్‌‌‌‌‌‌‌‌ టెర్మ్‌‌‌‌‌‌‌‌లో 22,400–22,600 వరకు కదలొచ్చన్నారు. దిగువన 22,100 దగ్గర సపోర్ట్ దొరుకుతుందని చెప్పారు.

 నికాయ్‌‌‌‌‌‌‌‌ 34 ఏళ్ల రికార్డ్‌‌ బ్రేక్ 

జపనీస్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ నికాయ్‌‌‌‌‌‌‌‌ 225 ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ గురువారం కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 1989 లో నమోదు చేసిన 38,916 లెవెల్‌‌‌‌‌‌‌‌ను 34 ఏళ్ల తర్వాత మొదటిసారిగా గురువారం అధిగమించింది.  2.2 శాతం లాభంతో 39,099 దగ్గర క్లోజయ్యింది.  జపనీస్ బ్యాంకులు 100 ట్రిలియన్ యెన్‌‌‌‌‌‌‌‌ల మొండిబాకీలను రద్దు చేయడంతో 1989 పీక్ లెవెల్‌‌‌‌‌‌‌‌ నుంచి నికాయ్ పడుతూ వచ్చింది. 

భూకంపం, సునామి,  నూక్లియర్ ప్లాంట్ మెల్ట్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ దెబ్బకు 2011 లో 8,200 లెవెల్‌‌‌‌‌‌‌‌ దిగువకు పడిపోయింది. ఫారిన్ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేస్తుండడంతో గత కొన్ని నెలలుగా నికాయ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతూ వస్తోంది. గత కొన్ని సెషన్ల నుంచి 34 ఏళ్ల గరిష్టం వద్ద కదలాడింది. గత పదేళ్ల నుంచి జపాన్‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్లు మైనస్ 0.1 శాతం దగ్గర కొనసాగుతున్నాయి. డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జపనీస్ ఎకానమీ రెసిసెషన్‌‌‌‌‌‌‌‌లోకి జారుకోవడంతో మానిటరీ పాలసీలో మార్పులు ఉండవని అంచనా. అందుకే నికాయ్ పెరుగుతోంది.