OTT Movies: జియోహాట్‌స్టార్‌లోకి రెండు బ్లాక్‌బస్టర్ మూవీస్.. లోబడ్జెట్ సినిమాలు, వందల కోట్ల లాభాలు

OTT Movies: జియోహాట్‌స్టార్‌లోకి రెండు బ్లాక్‌బస్టర్ మూవీస్.. లోబడ్జెట్  సినిమాలు, వందల కోట్ల లాభాలు

ప్రస్తుతం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఆడియన్స్కు తెగ నచ్చేస్తున్నాయి. ఒకప్పుడు రియల్ ఇన్సిడెంట్ సినిమాలంటే నెట్ఫ్లిక్స్ అని చెప్పుకునే వాళ్లు. కానీ, ఇప్పుడు కథ మారిపోయింది. దాదాపు అన్నీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మంచి సినిమాలనే తీసుకొస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో అయితే, జియోహాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీ ప్లాట్ఫామ్ మంచి ఊపు మీద కనిపిస్తోంది. వివిధ భాషల్లో సూపర్ హిట్ అందుకున్న సినిమాల హక్కులను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుంచుతోంది. లేటెస్ట్గా ఓ రెండు బ్లాక్‌బస్టర్ సినిమాల స్ట్రీమింగ్ డేట్స్ను అనౌన్స్ చేసి ఇంట్రెస్ట్ పెంచింది. మరి ఆ సినిమాలేంటీ? వాటి కథేంటీ? అనేది తెలుసుకుందాం. 

టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ:

తమిళ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ మూవీ జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో జియోహాట్‌స్టార్ లోకి రాబోతోంది.

శశి కుమార్, సిమాన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్గా నిలిచింది.

దాదాపు రూ.16కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.77కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. మొదటి సినిమాతోనే డైరెక్టర్ అభిషాన్ ఈ రేంజ్ విక్టరీ సాధించడం అంటే చిన్న విషయం కాదు. ఇక రజినీకాంత్, రాజమౌళి, సూర్య, నాని వంటి వారు కూడా మూవీపై ప్రశంసలు కురిపించారు. 

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం వల్ల మన దేశానికి అక్రమంగా వలస వచ్చిన ఓ చిన్న కుటుంబం చుట్టూ తిరిగే కథ. అరెస్టు బెదిరింపుల మధ్య, అంటీ ముట్టనట్టుగా ఉండే చుట్టుపక్కల వాళ్లతో కలిసిపోడానికి ఎలా కష్టపడాల్సి వచ్చింది అనేది ఎమోషనల్‌‌ అండ్‌‌ కామెడీ కలగలిపి అభిషాన్  తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది.  

తుడరుం ఓటీటీ:

సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తుడరుమ్’(Thudarum).వెటరన్ హీరోయిన్ శోభన..ఆయనకు జోడీగా నటించారు. తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎం.రెంజిత్ నిర్మించారు. ఏప్రిల్ 25న ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా విడుదలైంది. తెలుగులోనూ ఈ మూవీ రిలీజైంది.  

తుడరుమ్ సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాలో మోహన్‌లాల్ నటన సూపర్ అంటూ అభిమానులు, రివ్యూయర్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ మూవీ దృశ్యం మూవీ శైలిలో ఉందంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

►ALSO READ | Kannappa: మంచు విష్ణు కుమార్తెల టాలెంట్ చూశారా.. ‘కన్నప్ప’లో అద్భుతమైన పాటకు గానం

ఇపుడీ ఈ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ శుక్రవారం (మే 30) నుంచి జియోహాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉండనుంది.

ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.230 కోట్లకుపైగా వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేసింది. తుడరుమ్ సినిమాను రూ.30 కోట్ల బడ్జెట్ లోనే తెరెకెక్కించి హిట్ కొట్టాడు మోహన్ లాల్.  ఈ లెక్కన చూస్తే తుడరుమ్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తే, చిన్న హీరోలైన, పెద్ద హీరోలైనా మంచి విజయాలు దక్కించుకోగలరని నిరూపణ అయ్యింది. ఇకపోతే, ఈ సినిమాతో మోహన్ లాల్ మరోసారి కంప్లీట్ స్టార్ అనిపించుకున్నాడు.