Kannappa: మంచు విష్ణు కుమార్తెల టాలెంట్ చూశారా.. ‘కన్నప్ప’లో అద్భుతమైన పాటకు గానం

Kannappa: మంచు విష్ణు కుమార్తెల టాలెంట్ చూశారా..  ‘కన్నప్ప’లో అద్భుతమైన పాటకు గానం

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప నుంచి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న కన్నప్ప సినిమాతో విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా సినీ ఎంట్రీ ఇస్తున్నారు. 

లేటెస్ట్గా (మే28న) కన్నప్పలో అరియానా, వివియానాలపై చిత్రీకరించిన ‘శ్రీకాళహస్తి’ పాట విడుదల చేశారు మేకర్స్.  ‘జనులారా వినరారా శ్రీకాళహస్తి గాథ’అంటూ సాగిన ఈ పాటను అరియానా, వివియానా పాడడం విశేషత సంతరించుకుంది. స్టీఫెన్‌ దేవస్సీ స్వరపరిచిన ఈ పాటకు సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం అందించారు. 

'జనులారా వినరారా శ్రీకాళహస్తి గాథ.. కనులారా మనసారా.. కనిన జన్మ ధన్యమే కదా.. నీ కథ, తాండవం.. శివ తాండవం పార్వతి పరమేశ్వరం' అని గంభీరమైన గళంతో అరియానా, వివియానా పాడారు.

ఈ పాట శ్రోతలను వీపరీతంగా ఆకట్టుకునేలా ఉంది. అసలు ఈ పాట పాడింది ప్రొఫెషనల్ సింగర్స్ అనేలా ఆసక్తి రేకేత్తిస్తోంది. మంచు వారి ఇంటా మెరిసిన గాన కోకిలలు అంటూ విష్ణు కూతుర్ల టాలెంట్ ను ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. 

మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని 'కన్నప్ప' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విష్ణు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 'మహాభారత' సిరీస్ ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.