ఇరాన్ వర్సిటీతో జేఎన్టీయూ చర్చలు

ఇరాన్ వర్సిటీతో జేఎన్టీయూ చర్చలు

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్టీయూలో పరిశోధనల అభివృద్ధిలో భాగంగా సోమవారం వర్సిటీ అధికారులు ఇరాన్​కు చెందిన ఇస్ఫహాన్​ యూనివర్సిటీ అధికారులతో ఆన్​లైన్​ సమావేశం నిర్వహించారు. ఇస్ఫహాన్​ వర్సిటీ అధ్యక్షుడు, డైరెక్టర్ల బోర్డు అధిపతి రసౌల్​ రోక్నిజాదే, ఇరాన్​ అధికారులతో జరిగిన ఆన్​లైన్​ సమావేశంలో జేఎన్టీయూ రిజిస్ట్రార్​ డాక్టర్​ కె.వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. 

వర్సిటీ విద్యా కార్యకలాపాలు, పరిశోధన, అభివృద్ధితో పాటు జేఎన్టీయూలో ఉన్న మౌలిక సదుపాయాలపై ప్రజెంటేషన్​ ఇచ్చారు. రెండు వర్సిటీల మధ్య గ్రాడ్యుయేట్​, పోస్ట్​ గ్రాడ్యుయేట్​ విద్యార్థుల మార్పిడీ, ఫ్యాకల్టీ మార్పిడీ అంశాలపై చర్చించారు. అంతకు ముందు జేఎన్టీయూ డైరెక్టర్​ డాక్టర్​ కె.విజయకుమార్​రెడ్డి, రిజిస్ట్రార్​ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్​ జీవీ నరసింహారెడ్డి, వైస్​ ప్రిన్సిపాల్​ ఎ.రఘరామ్​తో సమావేశం నిర్వహించారు.