మెకానికల్ రంగంలో  ఇన్నోవేషన్స్ రావాలి : కట్టా నర్సింహా రెడ్డి

మెకానికల్ రంగంలో  ఇన్నోవేషన్స్ రావాలి : కట్టా నర్సింహా రెడ్డి
  • జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహా రెడ్డి

జేఎన్టీటీయూ, వెలుగు : మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ల నుంచి సరికొత్త ఇన్నోవేషన్స్ రావాలని జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహా రెడ్డి అన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్’ అనే అంశంపై జేఎన్టీయూలోని జీబీకేరావు సెమినార్ హాల్​లో మంగళవారం ఒక రోజు జాతీయ సదస్సు జరిగింది. వీసీ కట్టా నర్సింహా రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సెమినార్​లో 30కి పైగా పేపర్​ప్రజెంటేషన్లు, వివిధ అంశాల మీద చర్చలు నిర్వహించారు.  పలువురు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్​ మెకానికల్ ​రంగంలో రావాల్సిన కొత్త మార్పులపై వారి అభిప్రాయాలను తెలిపారు.  మెకానికల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు జరగాలన్నారు. 

రిజిస్ట్రార్ పదవీ విరమణ

జేఎన్టీయూ రిజిస్ట్రార్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డా. మంజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంగళవారం పదవీ విరమణ చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంజూర్​ హుస్సేన్​ వర్సిటీకి చేసిన సేవలను వీసీ, ప్రొఫెసర్లు గుర్తు చేసుకున్నారు.  అనంతరం ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో  రెక్టార్​ గోవర్ధన్, ఇంజనీరింగ్​కాలేజీ ప్రిన్సిపల్​ విజయకుమార్​రెడ్డి,  వైస్ ప్రిన్సిపల్​జీవీ నర్సింహా రెడ్డి, మెకానికల్​ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్​ డా. రాంజీ, ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు.