
విద్యా సంస్థల్లో పెరుగుతున్న అల్లర్లు, హింసాత్మక ఘటనల్ని దృష్టిలో ఉంచుకొని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) కొత్త నిబంధల్ని జారీ చేసింది. ఇకనుంచి యూనివర్సిటీ క్యాంపస్ లో ఎవరైనా ధర్నాలు చేస్తే రూ.20,000 ఫైన్ విధించనున్నారు. ర్యాగింగ్ లాంటి హింసాత్మక ఘటనలకు పాల్పిడితే అడ్మిషన్ రద్దు చేయనున్నారు. జూదం ఆడటం, హాస్టల్ గదులను అనధికారికంగా ఆక్రమించడం, యూనివర్సిటీ నిధులను దుర్వినియోగం చేయటం, అవమానకరమైన పదజాలం మాట్లాడటం, ఫోర్జరీ లాంటి 17 నేరాలను పరిగణంలోకి తీసుకుంటూ సర్క్యులర్ జారీ చేసింది. వాటిని అతిక్రమిస్తే రూ.30 వేల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది.
10 పేజీలతో కూడిన సర్క్యులర్ ని పాస్ చేసిన జేఎన్ యూ వైస్ ఛాన్స్ లర్ శాంతిశ్రీ డి పండిట్ ఫిబ్రవరి 3 నుంచి రూల్స్ కఠినంగా అమలవుతాయని తెలిపారు. రూల్స్ ని ఎవరు బ్రేక్ చేసినా వాళ్లపై కఠిన చర్య తప్పవని హెచ్చరించారు. బీబీసీ మోడీ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన తర్వాత యూనివర్సిటీల్లో తీవ్రమైన రాజకీయ పరిణామాలు ఎదురయ్యాయి. రాజకీయ కుట్రలతో గొడవలు జరగకుండా ఉండేందుకు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధల్ని తీసుకొచ్చారు.