లాక్ డౌన్ ఎఫెక్ట్.. కొలువుల కోత ఆగడం లేదు

లాక్ డౌన్ ఎఫెక్ట్.. కొలువుల కోత ఆగడం లేదు

వెలుగు, బిజినెస్‌‌‌‌డెస్క్:  కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ ఉద్యోగులపై బాగా ఎఫెక్ట్ చూపింది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో బిజినెస్‌‌‌‌లు, ఫ్యాక్టరీలు మూత పడటంతో.. కంపెనీల రెవెన్యూలు బాగా తగ్గిపోయాయి. దీంతో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేయడం ప్రారంభించాయి. ఇలా గత రెండు నెలల నుంచి కొనసాగుతున్న కొలువుల కోత ఇంకా వదలడం లేదు. తాజాగా మరిన్ని కంపెనీలు ఉద్యోగాల కోతను ప్రకటించాయి. ఫ్రెంచ్‌‌‌‌ కారు కంపెనీ రెనాల్ట్ 2 బిలియన్ యూరోల ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 15 వేల ఉద్యోగాల కోతను ప్రకటించింది. ఫ్రాన్స్‌‌‌‌లో 4600 ఉద్యోగాలను, మిగిలిన ప్రాంతాల్లోనూ 10 వేలకు పైగా ఉద్యోగాలను తగ్గించనున్నట్టు రెనాల్ట్ తెలిపింది. ప్రొడక్షన్ కెపాసిటీని కూడా ఈ ఏడాది ఉన్న 40 లక్షల నుంచి 2024  నాటికి 33 లక్షలకు తగ్గించనున్నట్టు పేర్కొంది. రెనాల్ట్ గ్రూప్‌‌‌‌లో మొత్తంగా లక్షా 80 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

కాస్ట్​ కటింగ్​ కోసమే

ఆన్‌‌‌‌లైన్ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌‌‌‌పామ్ బుక్‌‌‌‌మైషో కూడా 270 మంది ఉద్యోగులను తీసేసినట్టు ప్రకటించింది. కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ కారణంగా వచ్చే కొన్ని నెలల్లో రెవెన్యూలు బాగా తగ్గుతాయని ఈ కంపెనీ అంచనావేసింది. ఈ క్రమంలో భాగంగా తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు బుక్‌‌‌‌మైషో తెలిపింది. అదేవిధంగా లీడర్‌‌‌‌‌‌‌‌షిప్ లెవెల్‌‌‌‌లో వాలంటరీగా తీసుకున్న వేతన కోతలు 10 శాతం నుంచి 50 శాతం వరకు ఉన్నాయని పేర్కొంది. కాస్ట్ సేవింగ్ చర్యలను కంపెనీ చేపడుతోందని తెలిపింది. కన్జూమర్ లోన్ ఫైనాన్స్ సంస్థ హోమ్ క్రెడిట్ ఇండియా కూడా తన ఉద్యోగుల్లో 1800 మందిని తీసేస్తున్నట్టు తెలిపింది. ఊహించని విధంగా వచ్చిన ఈ కరోనా మహమ్మారి మన జీవితంలో ప్రతి భాగంపై ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. ఈ ఛాలెంజింగ్ టైమ్‌‌‌‌లో డిమాండ్లను అందుకోవడం కోసం తమ టీమ్ సైజును తగ్గిస్తున్నట్టు కంపెనీ చెప్పింది.  ఈ కోతలో ప్రభావితమవుతున్న ఉద్యోగులకు కొత్త అవకాశాల కోసం సాయం చేస్తామని హామీ ఇచ్చింది. వచ్చే 12 నెలలు, హోమ్ క్రెడిట్ ఇండియా టాలెంట్ అక్విజిషన్ టీమ్ ఈ ఉద్యోగులకు సాయం చేయనుందని తెలిపింది.

ఈ ఐదు కంపెనీల్లో 4,000 పైగా ఉద్యోగాల కోత

అమెరికాకు చెందిన ఉబర్‌‌‌‌‌‌‌‌ కూడా ఇండియా, సౌత్ ఆసియా రీజన్‌‌‌‌లో 600 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ లేఆఫ్స్ ఎక్కువగా ఇండియాలోనే ఉన్నట్టు చెప్పింది. ఉబర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఓలా, జొమాటో, స్విగ్గీ, క్యూర్.ఫిట్‌‌‌‌లు కూడా ఉద్యోగాల కోతను ప్రకటించాయి. ఉబర్ ప్రత్యర్థి ఓలా తన ఉద్యోగుల్లో 1400 మందిని ఇంటికి పంపేస్తోంది. ఈ విషయాన్ని ఉద్యోగులకు ఈమెయిల్స్ ద్వారా తెలిపింది. స్విగ్గీ, జొమాటోలు కూడా ఎంప్లాయి బేస్‌‌‌‌ను తగ్గించుకునే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. వచ్చే 6–12 నెలల్లో జొమాటో ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పై రెస్టారెంట్ల సంఖ్య 25–40 శాతం పడిపోతుండగా..  541 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్టు తెలిపింది. వీరిని కొత్త జాబ్స్ చూసుకోమని చెప్పింది. స్విగ్గీ కూడా 1,100 మంది వరకు ఉద్యోగులకు గుడ్ బై చెబుతోంది. క్యూర్.ఫిట్ సుమారు 800 మందిని తీసేసింది. ఇలా ఈ ఐదు కంపెనీలు కలిపి మొత్తంగా గత నెలలో 4,441 ఉద్యోగాల లేఆఫ్స్‌‌‌‌ను ప్రకటించాయి. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం తప్ప తమ వద్ద మరో ఆప్షన్ లేదని కంపెనీలు చేతులెత్తేశాయి.