బ్యాంక్​ జాబ్స్‌ స్పెషలిస్ట్​ ఆఫీసర్స్

బ్యాంక్​ జాబ్స్‌ స్పెషలిస్ట్​ ఆఫీసర్స్

నిరుద్యోగులకు వరుస బ్యాంక్ నోటిఫికేషన్స్​ వరంలా మారాయి. ఇప్పటికే పీఓ, ఎస్ఓ పోస్టులకు ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు సెంట్రల్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, బ్యాంక్​ ఆఫ్​ బరోడా నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్​ జాబ్స్​ రిలీజ్​ అయ్యాయి. కామన్​ సబ్జెక్టులను ప్లాన్​ ప్రకారం ప్రిపరేషన్​ కొనసాగిస్తూ ప్రాక్టీస్​ చేస్తే  అనుకున్న బ్యాంక్​ కొలువు సాధించడం సులువే. బ్యాంకింగ్​ రంగంలో ఉన్నతంగా స్థిరపడాలనుకునే అభ్యర్థులకు స్పెషలిస్ట్​ ఆఫీసర్​ నోటిఫికేషన్​ మంచి అవకాశం. సిలబస్​లో ఇచ్చిన అంశాలను ప్లాన్​ ప్రకారం డైలీ ప్రాక్టీస్​ చేస్తూ, ప్రీవియస్​ పేపర్స్​ సాధన చేస్తే ఈ పోటీ పరీక్షలో విజయం సాధించవచ్చు. 

బ్యాంక్‌‌ ఆఫ్‌‌ బరోడా (బీఓఐ)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్‌‌ ఆఫ్‌‌ బరోడా ఐటీ స్పెషలిస్ట్‌‌ ఆఫీసర్‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌‌ ద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డాటా సైంటిస్ట్‌‌, డాటా ఇంజినీర్‌‌ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగినవారు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను  ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు: 15

పోస్టుల వివరాలు
డైటా సైంటిస్ట్‌‌: 9
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌‌/ ఎంఈ/ ఎంటెక్‌‌ ఉత్తీర్ణత. 
వయసు: 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
డేటా ఇంజినీర్‌‌: 6
అర్హత: కంప్యూటర్‌‌ సైన్స్‌‌/ ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌‌లైన్‌‌ టెస్ట్‌‌, సైకోమెట్రిక్‌‌ టెస్ట్‌‌, గ్రూప్‌‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ఎగ్జామ్​ ప్యాటర్న్: ఈ పరీక్షని మొత్తం 225 మార్కులకి నిర్వహిస్తారు. 150 ప్రశ్నలకి గాను పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. 
దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్​ ఫీజు: ఇతరులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
ఆన్‌‌లైన్‌‌ అప్లికేషన్స్​ ప్రారంభం: 16 నవంబర్​
చివరి తేది: 6 డిసెంబర్ 2021
వెబ్​సైట్​: www.bankofbaroda.in

సెంట్రల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న సెంట్రల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా(సీబీఐ)కి చెందిన హ్యూమన్‌‌ రిసోర్సెస్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ విభాగం స్పెషలిస్ట్ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేయాలి.
మొత్తం ఖాళీలు: 115
పోస్టులు: ఎకనమిస్ట్‌‌, ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ ఆఫీసర్‌‌, ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ, డేటా సైంటిస్ట్‌‌, క్రెడిట్‌‌ ఆఫీసర్లు, డేటా ఇంజినీర్లు, ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్‌‌, ఐటీ ఎస్‌‌ఓసీ అనలిస్ట్‌‌, రిస్క్‌‌ మేనేజర్లు, టెక్నికల్‌‌ ఆఫీసర్లు (క్రెడిట్‌‌), ఫైనాన్షియల్‌‌ అనలిస్ట్‌‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌‌, ఇంజినీరింగ్‌‌ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్‌‌ డిగ్రీ, సీఏ/ సీఎఫ్‌‌ఏ/ ఏసీఎంఏ, పీహెచ్‌‌డీ ఉత్తీర్ణత.
వయసు: పోస్టుల్ని అనుసరించి 20 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌‌లైన్‌‌ రాత పరీక్ష, పర్సనల్‌‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: రాత పరీక్షని మొత్తం 100 మార్కులకి నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలకి గాను పరీక్షా సమయం 60 నిమిషాలు కేటాయిస్తారు. పరీక్షని ఇంగ్లిష్‌‌, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. ఐదు ఆప్షన్లతో ఆబ్జెక్టివ్‌‌ విధానంలో ప్రశ్నల సరళి ఉంటుంది. నెగిటివ్‌‌ మార్కింగ్‌‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున కోత విధిస్తారు.
దరఖాస్తులు: ఆన్‌‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: 23 నవంబర్​
చివరి తేది: 17 డిసెంబర్​
వెబ్​సైట్​: centralbankofindia.co.in

సబ్జెక్ట్               ప్రశ్నలు     మార్క్స్​
రీజనింగ్​              25          25
ఇంగ్లిష్​ లాంగ్వేజ్​    25         25
ఆప్టిట్యూడ్​           25         25
ప్రొఫెషనల్​ నాలెడ్జ్​  75       150