టెన్త్ అర్హతతో పోస్టల్​ జాబ్స్​.. రోజుకు నాలుగు గంటలే డ్యూటీ

టెన్త్ అర్హతతో పోస్టల్​ జాబ్స్​.. రోజుకు నాలుగు గంటలే డ్యూటీ
  • తెలంగాణలో 1150.. ఏపీలో 2296 పోస్టులు

ఇండియన్​ పోస్టల్​ డిపార్ట్​మెంట్​ తెలంగాణ సర్కిల్​లో దాదాపు 25 జిల్లాల్లోని 18 పోస్టల్​ డివిజన్లలో ఖాళీగా ఉన్న1150 గ్రామీణ డాక్​ సేవక్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. టెన్త్​ పాసైన అభ్యర్థులు ఫిబ్రవరి 26లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పోస్టల్​ సేవలను ప్రతి గ్రామానికి విస్తరించాలని నిర్ణయించింది. ఈ సేవల విస్తరణలో బీపీఎం/ఏబీపీఎంల పాత్ర కీలకం కానుంది. సొంత ఊర్లో ఉంటూ బ్రాంచ్​ పోస్ట్​ మాస్టర్​(బీపీఎం) లేదా అసిస్టెంట్​ పోస్ట్​ మాస్టర్​(ఏబీపీఎం)గా రోజుకు నాలుగు నుంచి అయిదు గంటలు పనిచేస్తూ.. నెలకు రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు సంపాదించే అవకాశం పోస్టల్​ డిపార్ట్​మెంట్​ కల్పిస్తోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే టెన్త్ మెరిట్​ ఆధారంగా ఉన్న ఊరిలోనే జాబ్​ చేయొచ్చు. బీపీఎం లేదా ఏబీపీఎం బ్రాంచ్​ పోస్ట్​ ఆఫీస్​ పరిధిలో ఉత్తర, ప్రత్యుత్తరాల బట్వాడా, ల్యాప్​టాప్​/మొబైల్​/ఇతర ఎక్విప్​మెంట్స్​ యూజ్​ చేస్తూ.. ఇండియన్​ పోస్టల్​ పేమెంట్​ బ్యాంక్​  లావాదేవీలు, కౌంటర్​ ఆపరేషన్స్​, రికార్డుల నిర్వహణతోపాటు ఐపీవో/ఏఎస్​పీవో/ఎస్​పీఓస్​/ఎస్​ఎస్​పీఓస్​/ఎస్​ఆర్​ఎం/ఎస్​ఎస్​ఆర్​ఎం తదితర ఉన్నతాధికారులు ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది.  గంటల ప్రాతిపదికన వేతనం ఉంటుంది.

మొత్తం పోస్టులు: 1150; విభాగాలు: బీపీఎం(బ్రాంచ్​ పోస్ట్​ మాస్టర్​), ఏబీపీఎం(అసిస్టెంట్​ బ్రాంచ్​ పోస్ట్​ మాస్టర్​) రిజర్వేషన్ల వారీగా  ఈడబ్ల్యూఎస్​–130, ఓబీసీ–279, పీడబ్ల్యూడీ–38, ఎస్సీ–154, ఎస్టీ–65, అన్​రిజర్వ్​డ్​–484 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: మ్యాథ్స్​, లోక‌ల్ లాంగ్వేజ్‌, ఇంగ్లీష్ స‌బ్జెక్టులతో టెన్త్​ ఉత్తీర్ణత‌. అభ్యర్థి క‌నీసం ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు లోక‌ల్ లాంగ్వేజ్‌లో చ‌దివి ఉండాలి. కంప్యూట‌ర్ ట్రెయినింగ్ కోర్సు చేసి  ఉండాలి. సంబంధిత గ్రామ ప‌రిధిలో నివాసం ఉండాలి.

వయసు: 2021 జనవరి 27 నాటికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్యర్థుల‌కు ప‌దేళ్ల ఏజ్​ రిలాక్సేషన్​ ఉంటుంది.

శాలరీస్​: టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అల‌వెన్స్(టీఆర్‌సీఏ) ప‌ద్ధతిలో వీరికి చెల్లింపులు ఉంటాయి.  బ్రాంచ్ పోస్టు మాస్టర్‌(బీపీఎం) పోస్టుకు క‌నీసం 4 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ. 12000, క‌నీసం 5 గంట‌ల‌కు టీఆర్‌సీఏ కింద రూ.14500 చెల్లిస్తారు. ఏబీపీఎం/ డాక్ సేవ‌క్‌ పోస్టుకు క‌నీసం 4 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ. 10000, క‌నీసం 5 గంట‌ల‌కు  రూ.12000 చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన స‌ర్టిఫికెట్ల ఆధారంగా రూల్స్​ ప్రకారం ఆటోమేటిక్ జ‌న‌రేటెడ్ మెరిట్ లిస్ట్ త‌యార‌వుతుంది. టెన్త్​లో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. ఒకే మార్కులు లేదంటే జీపీఏ ఉంటే వయసును బట్టి ఎంపిక చేస్తారు.

సెక్యూరిటీ డిపాజిట్​

మెరిట్​ ప్రకారం పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్​ఎంఎస్​ లేదా ఇతర మార్గాల్లో సమాచారం అందుతుంది. సెలెక్టెడ్​ అభ్యర్థుల ఒరిజినల్​ సర్టిఫికెట్లను పరిశీలించి అపాయింట్​మెంట్​ ఇస్తారు. అయితే అపాయింట్​మెంట్​ అందుకున్న వారు. వారికి కేటాయించిన గ్రామం లేదా ఆవాసం పరిధిలో బ్రాంచ్​ పోస్ట్​ ఆఫీస్​ ఏర్పాటుకు 100 స్క్వేర్​ఫీట్స్​లో అకామిడేషన్​ చూడాల్సి ఉంటుంది.  పోస్టల్​ డిపార్ట్​మెంటే ఆఫీస్​ నిర్వహణకు నెలనెలా అలవెన్స్​లు ఇస్తుంది. డిపార్ట్​మెంట్​కు సంబంధించిన మొబైల్స్​/ల్యాప్​టాప్స్​/ట్యాబ్స్​/ స్టాంప్​లు తదితర​ విలువైన ఎక్విప్​మెంట్స్ అభ్యర్థికి ఇస్తారు కాబట్టి రూ. లక్ష సెక్యూరిటీ డిపాజిట్​ కింద పే చేయాల్సి ఉంటుంది.

రిక్వైర్డ్​ డాక్యుమెంట్స్​

టెన్త్​, కంప్యూటర్​, కమ్యూనిటీ, డేట్​ ఆఫ్​ బర్త్​ సర్టిఫికెట్లతోపాటు పీహెచ్​ వాళ్లు, ట్రాన్స్​జెండర్స్​ వారి వారి ధ్రువపత్రాలు అప్​లోడ్​ చేయాల్సి ఉంటుంది.

ఏపీలో 2296 పోస్టులు

ఆంధ్రప్రదేశ్​ సర్కిల్​ పరిధిలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, పార్వతీపురం, అనకాపల్లి, అమలాపురం, విజయవాడ, తెనాలి, తాడేపల్లిగూడెం, ప్రకాశం, నెల్లూరు, నర్సరావుపేట, మచిలీపట్నం, గుంటూరు, గూడూరు, గుడివాడ, ఏలూరు, భీమవరం, తిరుపతి, ప్రొద్దుటూరు, నంద్యాల, కర్నూలు, హిందూపురం, కడప, చిత్తూరు, అనంతపురం మొత్తం 28 పోస్టల్​ డివిజన్లలో 2,296 గ్రామీణ డాక్​ సేవక్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది. వీటిలో.. ఈడబ్ల్యూఎస్​324, ఓబీసీ–507, పీడబ్ల్యూడీ–96, ఎస్సీ–279, ఎస్టీ–143, అన్​రిజర్వ్​డ్​947 మొత్తం 2,296 పోస్టులు ఉన్నాయి.

–వెలుగు ఎడ్యుకేషన్​ డెస్క్​

ముఖ్యసమాచారం

అప్లికేషన్లు: ఆన్​లైన్​లో..

అప్లికేషన్​ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు.

అప్లికేషన్లు ప్రారంభం: 27 జనవరి 2021

చివరి తేది: 26 ఫిబ్రవరి 2021

వెబ్​సైట్​: telanganapostalcircle.in

For More News..

ఏ దేశం వెళ్లి పాడినా కోటి రూపాయలొస్తయ్​

టెన్త్​, ఇంటర్​తో జాబ్​ గ్యారంటీ కోర్సులు

స్కూల్స్ రీ ఓపెన్.. శానిటైజేషన్‌కు ఫుల్ డిమాండ్