కాంట్రాక్ట్ వద్దు దొర.. పర్మనెంటుగా నింపు జర

కాంట్రాక్ట్ వద్దు దొర.. పర్మనెంటుగా నింపు జర
  • వైఎస్ షర్మిల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ‘హెల్త్ డిపార్ట్​మెంట్​లో కాంట్రాక్ట్​ ఉద్యోగాలు వద్దు దొర.. పర్మనెంట్ పద్ధతిలోనే నింపు జర’ అని వైఎస్ షర్మిల సోమవారం ఒక ప్రకటనలో సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన 755 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం సరికాదన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 23,512 ఉద్యోగాలను పర్మినెంట్ రిక్రూట్మెంట్​ ద్వారా భర్తీ చేయాలని అన్నారు. తెలంగాణలో కాంట్రాక్ట్​ ఉద్యోగాలు ఉండవన్న మాటకు సీఎం కట్టుబడి ఉండాలన్నారు. మొత్తం ఉద్యోగాలను నింపితే కరోనాను ఎదుర్కొనే సైన్యం పెరగడంతోపాటు నిరుద్యోగాన్ని కొంతమేరకైనా ఆపొచ్చని షర్మిల పేర్కొన్నారు. ఖాళీలను  భర్తీ చేసి ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించాలని సూచించారు.