అలంపూర్ జోగులాంబ ఆలయాల్లో భక్తుల సందడి

అలంపూర్ జోగులాంబ ఆలయాల్లో భక్తుల సందడి

అలంపూర్, వెలుగు: జోగులాంబ శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో భారీ భక్తులు తరలివచ్చారు.

తొలుత గణపతి శివాలయంలో అభిషేకాలు చేసి జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.