అలంపూర్ ఆలయాభివృద్ధిపై సమావేశం

అలంపూర్ ఆలయాభివృద్ధిపై సమావేశం

అలంపూర్, వెలుగు: అలంపూర్ ఆలయాల అభివృద్ధిపై సోమవారం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్​ నాగేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో  సీసీరోడ్ల పునః నిర్మాణం చేపట్టాలన్నారు. గోశాలలో ఆవుల సంఖ్య పెరగడంతో, సిబ్బంది కొరతతో వాటి నిర్వహణ కష్టంగా మారిందన్నారు. ఆవులలో కొన్నింటిని ఇతర గోశాలకు విక్రయించడం లేదా తరలించడం చేయాలన్నారు. 2024–25 కు వివిధ టెండర్ల ద్వారా బకాయాలను వసూలు చేయాలని నిర్ణయించారు.

రేపు అలంపూర్ లో జరిగే ఆలయ అభివృద్ధి హై లెవెల్ కమిటీ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానించింది. అనంతరం ఆదాయ, వ్యయయాలు, వెండి, బంగారు వస్తువుల వివరాలు, భూముల వివరాలు పరిశీలించారు. సమావేశంలో ఆలయ ఈవో పురేందర్ కుమార్, ధర్మకర్తలు నాగ శిరోమణి, జగదీశ్వర్ గౌడ్, విశ్వనాథ రెడ్డి, గోపాల్, వెంకటేశ్వర్లు, జయ రాముడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.