
కోడేరు, వెలుగు: మండలంలోని రాజాపూర్ హైస్కూల్లో సోమవారం నుంచి మధ్యాహ్న భోజనం ప్రారంభమైంది. శనివారం వెలుగు దినపత్రికలో ‘బడి బువ్వ లేక విద్యార్థుల తిప్పలు’ శీర్షికతో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు.
స్కూల్ రీ ఓపెన్ అయినప్పటికీ మధ్యాహ్న భోజనం ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారనే విషయాన్ని ఆఫీసర్లు సీరియస్గా తీసుకున్నారు. విషయం తెలియని కొందరు స్టూడెంట్లు లంచ్ బాక్సులు తెచ్చుకున్నారు. సీపీఎం నాయకులు ఎండీ మాలిక్, బాలయ్య స్కూల్కు వెళ్లి స్టూడెంట్స్ తో మాట్లాడారు. ఇక నుంచి రెగ్యులర్ గా భోజనం పెడతారని తెలిపారు.