
గద్వాల టౌన్, వెలుగు: వడ్డేపల్లి మండలం కోయిలదిన్నె గ్రామానికి చెందిన గోరంట్ల లక్ష్మీకాంతారెడ్డి అనే రిటైర్డ్ టీచర్ తనకు రైతు భరోసా కింద వచ్చిన రూ.95,400 సీఎం సహాయనిధికి అందించారు. సోమవారం కలెక్టర్ సంతోష్ కు చెక్కు అందించారు. రైతు భరోసా డబ్బులను సీఎం సహాయనిధికి అందజేసిన రైతును కలెక్టర్ అభినందించారు.