సూర్యాపేటలో జాన్‌‌‌‌ పహాడ్ ఉర్సు షురూ..

సూర్యాపేటలో జాన్‌‌‌‌ పహాడ్ ఉర్సు షురూ..

నేరేడుచర్ల (పాలకవీడు) వెలుగు: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా ఉర్సు గురువారం తెల్లవాజామున వైభవంగా ప్రారంభమైంది. భక్తులు దర్గా ముజావర్ జానీ బాబా ఆధ్వర్యంలో దట్టీలు, పూలతో మొక్కులు చెల్లించారు. మహిళలు కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉర్సులో ప్రధాన ఘట్టమైన గంధం ఊరేగింపు శుక్రవారం జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉర్సును సక్సెస్ చేయాలి: ఎస్పీ రాహుల్ హెగ్డే

పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఉర్సును సక్సెస్ చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశించారు. గురువారం  జాన్ పహాడ్ దర్గాలోని జేపీ ఫంక్షన్ హాల్‌‌‌‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంధం ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని సూచించారు. దర్గాకు వచ్చే అన్ని మార్గాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించామని, ఈ మేరకు పోలీసుల వాహనదారులకు సూచనలు చేయాలన్నారు. 500 మంది సిబ్బంది, 16 సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాజేశ్ మీనా, ఏఎస్పీ నాగేశ్వరరావు,  డీఎస్పీ ప్రకాశ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ రాజేశ్, హుజూర్ నగర్ సీఐ రామలింగారెడ్డి, పాలక వీడు ఎస్సై లింగయ్య పాల్గొన్నారు.