టీనేజర్స్ పై జాన్సన్ అండ్ జాన్సన్ టీకా టెస్టులు

టీనేజర్స్ పై జాన్సన్ అండ్ జాన్సన్ టీకా టెస్టులు

న్యూ బ్రన్స్ విక్: మెడికల్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ టీనేజర్స్ పై కరోనా టీకాను పరీక్షిస్తోంది. కౌమార దశలోని 16 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న వారిపై దీన్ని ప్రయోగిస్తోంది. గత సెప్టంబరులో మొదలైన ఈ టెస్టుల ఫలితాలను బట్టి 12 నుంచి 15 సంవత్సరాల వయస్సు పిల్లల మీద పరీక్షలు జరుపుతారని తెలుస్తోంది. యునైటెడ్ కింగ్డమ్ (యూకే), స్పెయిన్ లోని టీనేజర్స్ పై ఈ టెస్టులు నిర్వహిస్తారని.. తర్వాత వీరికి యునైటెడ్ స్టేట్స్, కెనడా, నెదర్లాండ్స్ లోని యువత మీద పరీక్షలు జరపనున్నారు. టెస్టుల్లో భాగంగా తొలి టీకా డోసు ఇచ్చిన మూడు నెలలకు రెండో డోసును ఇస్తారు. టీనేజర్లతో పాటు గర్భిణులు, చిన్న పిల్లలకూ వ్యాక్సిన్ పరీక్షలు చేయాలని అనుకుంటున్నామని జాన్సన్ ఫార్మానూటికల్స్ యూనిట్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవల్మెంట్ హెడ్ డాక్టర్ మథాయి మామెన్ తెలిపారు.