ఉత్తరాఖండ్‌ను కప్పేసిన మంచు దుప్పటి

ఉత్తరాఖండ్‌ను కప్పేసిన మంచు దుప్పటి

ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ కు మరో ముప్పు ముంచుకొచ్చింది. ఇప్పటికే భూమి కుంగిపోవడంతో రోడ్లు, భవనాలు, ఇండ్లు కూలిపోయే స్థితికి చేరాయి. తాజాగా విపరీతంగా కురుస్తున్న మంచుతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బద్రినాథ్, జోషిమఠ్, చమోలీ జిల్లాలతో పాటు గంగోత్రి తదితర ప్రాంతాలన్నీ మంచు దుప్పటి కప్పేసుకున్నాయి. దీంతో అక్కడి భవనాలు, పర్వతాలు, చెట్టపై తెల్లని ముంచు కనిపిస్తోంది.  

చమోలీ జిల్లాలో ఈ నెల 23 నుంచి 27 మధ్యన భారీ స్థాయిలో మంచుతో పాటు వర్షం కూడా పడొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక జోషిమఠ్ లో 4 నుంచి 6 అడుగుల మేర మంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

https://twitter.com/ANINewsUP/status/1616292289592324096