చిరుతతో జర్నలిస్ట్ వీరోచిత పోరాటం.. (వీడియో వైరల్)

చిరుతతో జర్నలిస్ట్ వీరోచిత పోరాటం.. (వీడియో వైరల్)

చిరుత పులిని దూరం నుంచి చూస్తేనే మనం వణికిపోతాం. ఇక అది దగ్గరకు వస్తుందంటే వెన్నులో వణుకుపుట్టడమే కాదు.. అక్కడి నుంచి వెనక్కి తిరగకుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తాం. అయితే, ఓ వ్యక్తి మాత్రం చిరుతపులితో విరోచితంగా పోరాటం చేశాడు. దానితో పోరాంట చేయటమే పెద్ద గొప్పనుకుంటే.. అతను ఏకంగా దాన్ని మట్టికరింపించడం మరో విశేషం. చిరుతతో ఫైట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ దుంగార్పుర్ జిల్లాలోని గడియా భదర్ మెట్వాలా గ్రామానికి ఓ జర్నలిస్ట్ కవరేజ్ కోసం వెళ్లాడు. అదే సమయంలో సమీపంలోని  భదర్ అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత పులి గ్రామంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో దానిని తరిమికొట్టేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే, అక్కడ కవరేజ్ చేస్తున్న జర్నలిస్ట్ పై చిరుత దాడి చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకుంది. దాంతో.. ఆ జర్నలిస్ట్ భయపడకుండా ధైర్యంగా చిరుతతో పోరాడి.. దాని దవడను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చేంతవరకు గ్రామస్థులు చిరుతను తాడుతో బంధించారు. కొద్దిసేపటి తర్వాత సంఘటనాస్థలానికి చేరకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించి తీసుకెళ్లారు.