రెగ్యులరైజ్​ చేయకుంటే దసరా తర్వాత సమ్మెలోకి

రెగ్యులరైజ్​ చేయకుంటే దసరా తర్వాత సమ్మెలోకి
  • ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న జేపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు     
  • ప్రొబేషన్ పీరియడ్ పెంపు, సస్పెన్షన్లపై ఆందోళన   

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో రాష్ట్ర పంచాయతీలకు ప్రకటిస్తున్న అవార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు కారణమైన పంచాయతీ సెక్రటరీలపై కొరడా ఝలిపిస్తోంది. కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు కట్టలేదని, మొక్కలు ఎండిపోయాయని, మురికి కాల్వలో మట్టి తీయలేదని, బజార్లు ఊడ్చలేదని, పంచాయతీ ఆఫీసుకు టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాలేదని, పల్లె ప్రగతి పనులు పూర్తి చేయలేదనే తదితర కారణాలతో మెమోలు, సస్పెన్షన్ ఆర్డర్లు ఇస్తోంది. కరెంట్ బిల్లులు చెల్లించలేదని నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలో 36 మంది పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇలారోజూ ఏదో ఒక చోట ఇద్దరు, ముగ్గురు పంచాయతీ సెక్రటరీలపై అధికారులు వేటు వేస్తున్నారు. అవార్డులొస్తే సర్కార్ గొప్పతనమంటూ ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. క్షేత్ర స్థాయిలో పనిచేసే తమను పట్టించుకోవడం లేదని పంచాయతీ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడేండ్లలో 1,500 మంది రిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 

కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఏటా ప్రకటిస్తున్న అవార్డుల్లో మెజారిటీ అవార్డులు రాష్ట్ర పంచాయతీలనే వరిస్తున్నాయి. ఈ క్రెడిట్ అంతా పంచాయతీ సెక్రటరీలు, మల్టీ వర్కర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే. ఈ విషయాన్ని చాలాసార్లు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మంత్రులు ఒప్పుకున్నారు. రాష్ట్రంలో 4 విడతల్లో చేపట్టిన పల్లె ప్రగతిని సక్సెస్ చేశారు. ఇంత చేస్తున్న పంచాయతీ సెక్రటరీలపై ఎంపీడీవోలు, డీపీవోల వేధింపులు ఎక్కువయ్యాయని సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడి, టార్గెట్లు, నోటీసులు, వేధింపులు భరించలేక, స్థానిక రాజకీయాల్లో ఇమడలేక మూడేండ్లలో 1,500 మంది జాబ్ వదిలేశారని తెలిపారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. 

రెగ్యులరైజేషన్ చేయకుంటే నిరవధిక సమ్మె.. 

రాష్ట్రంలో ఇప్పటికే వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏలు 72 రోజులుగా సమ్మె చేస్తుండగా, జూనియర్ పంచాయతీ సెక్రటరీలు కూడా దసరా తర్వాత వీరికి తోడు కానున్నారు. మూడేండ్ల ప్రొబేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నాలుగేళ్లకు పొడిగిస్తూ ఇచ్చిన జీవో నంబర్ 26 రద్దు కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన సెక్రటరీలు మరో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం తమను 30 రోజుల్లో రెగ్యులరైజ్​ చేయకుంటే నిరవధిక సమ్మెకు వెళ్లాలని ఇదివరకే నిర్ణయించారు. 
 
ముందు మూడేండ్లు.. తర్వాత నాలుగేండ్లకు.. 

2019 ఏప్రిల్ 12న 9,355 జూనియర్ పంచాయతీ సెక్రటరీల(జేపీఎస్)లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకున్నది. మూడేండ్లు ప్రొబేషనరీ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని అగ్రిమెంట్‌‌ చేయించుకుంది. 2022 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరి మూడేళ్లయినా వారి జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెగ్యులరైజ్ చేయకపోగా, మరో ఏడాది పెంచుతూ జీవో నంబర్ 26ను ఇచ్చింది. తెలంగాణ రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇది విరుద్ధమని పంచాయతీ సెక్రటరీలు అంటున్నారు. మూడేండ్ల తర్వాత గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- 4 ఉద్యోగులుగా తమను గుర్తించి రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని జేపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గుర్తుచేస్తున్నారు.