
వార్ 2 మరియు కూలీ సినిమాలు ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఒకేరోజు పోటాపోటీగా థియేటర్స్కి వచ్చి, ఆడియన్స్కు మంచి ట్రీట్ అందించాయి. అయితే, ఈ మూవీస్లో కూలీ అత్యధిక వసూళ్లు సాధించి వార్ 2ని అధిగమించింది.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన కూలీ ఓటీటీలోకి వచ్చి 20 రోజులు గడిచింది. కానీ, వార్ 2 స్ట్రీమింగ్ విషయంలో మాత్రం సందిగ్దత పెంచుతూ వస్తుంది.! ఇపుడు ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్లో మొదలైన చర్చ. ఎందుకంటే.. వార్ 2 ఓటీటీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే వార్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ డేట్ వైరల్ అవుతుంది. ఇప్పటికే, చాలా సందర్భాల్లో పలు స్ట్రీమింగ్ డేట్స్ వైరల్ అయ్యాయి. కానీ, ఈ డేట్ మాత్రం పక్కా అనే టాక్ మొదలైంది. మరి వార్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఏంటో ఓ లుక్కేద్దాం.
వార్ 2 డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సాధారణంగా బాలీవుడ్ సినిమాలు రిలీజైన 8 వారాల్లో ఓటీటీకి దర్శనం ఇస్తుంటాయి. అలా చూసుకుంటే.. దసరా స్పెషల్గా అక్టోబర్ 2న స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం అక్టోబర్ 9న స్ట్రీమింగ్ పక్కా అంటూ పోస్టర్ ట్రెండ్ అవుతుంది. ఈ లేటెస్ట్ టాక్ దృష్ట్యా అక్టోబర్ 2న లేదా అక్టోబర్ 9న వచ్చే ఛాన్స్ ఉంది. ఈ విషయంపై త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. సౌత్ ఇండియాలో ఎన్టీఆర్కు ఉన్న మాస్ ఫాలోయింగ్, హిందీలో హృతిక్కు ఉన్న క్రేజ్.. ఈ సినిమాను ఏమాత్రం నిలబెట్టలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతోందని తమ ఫ్యాన్స్ ఆశించినప్పటికీ, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ట్రేడ్ నివేదికల ప్రకారం.. వార్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల గ్రాస్, రూ. 236.54 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిందని సమాచారం.
►ALSO READ | దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా అరెస్ట్.. ఇండస్ట్రీకి రూ.22 వేల కోట్ల నష్టం
ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ను అయాన్ ముఖర్జీ తెరెకెక్కించాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. యష్ రాజ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ స్పై ఏజెంట్గా కనిపించారు.