
దేశంలోనే అతి పెద్ద పైరసీ రాకెట్ ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ల దగ్గర నుంచి హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ఇంటర్నెట్ కనెక్టివిటీలు స్వాధీనం చేసుకున్నారు.
నగర కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. హిట్, కుబేరా, హరిహరవీరమల్లు, పైరసీ పై దర్యాప్తు చేశారు పోలీసులు. తెలుగు సహా ఇతర భాషల సినిమాలు పైరసీ చేశారు నేరగాళ్లు. దీని వల్ల సినిమా ఇండస్ట్రీకీ ఇప్పటి వరకూ 22 వేల 400 కోట్లు నష్టం వచ్చినట్లు గుర్తించారు. ఇందులో టాలీవుడ్ కు 3,700 కోట్ల నష్టం వాటిల్లింది. 18 నెలల్లో 40కి పైగా తెలుగు, హిందీ, తమిళ సినిమాలు విడుదల రోజునే లీక్ చేశారు. హ్యాష్ ట్యాగ్ సింగిల్ సినిమా పైరస్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు ద్వారా గతంలో వనస్థలిపురానికి చెందిన కిరణ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిని జూలై 3న అరెస్ట్ చేశారు. కిరణ్ కస్టడీలోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు రాబట్టారు .
►ALSO READ | Bigg Boss 9 Elimination: డాక్టర్ పాప 3 వారాలకే ఎలిమినేట్.. కారణం అదేనంటా..!
దుబాయ్, నెదర్లాండ్, మియన్మార్ లో సినిమా పైరసీ కేటుగాళ్ళు ఉన్నట్లు గుర్తించారు. థియేటర్లలో వచ్చే సినిమా శాటిలైట్ కంటెంట్ ఐడీ.. పాస్ వర్డ్ లను ట్రాక్ చేస్తున్నారు. అంతేగాకుండా ఏజెంట్ల ద్వారా షర్ట్ జేబుల్లో ,పాప్ కార్న్ , కోక్,టిన్ లలో కెమెరాలు పెట్టి సినిమాలు రికార్డ్ చేస్తున్నారు. ఈ కంటెంట్ ను ఇతర వెబ్ సైట్లకు అమ్ముతున్నారు. ఏజెంట్లకు క్రిప్టోకరెన్సీ ద్వారా అకౌంట్లో కమీషన్లు ఇస్తున్నారు.