అజయ్ దిషన్, ధనుషా జంటగా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బూకి’. విజయ్ ఆంటోనీ సమర్పణలో రామాంజేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్రం శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత రామాంజేయులు జవ్వాజీ మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. కానీ కథ మాత్రం బ్రేకప్ తో మొదలవుతుంది.
బ్రేకప్ తర్వాత ఇప్పటి టీనేజర్స్ ఎలా సఫర్ అవుతున్నారు, ఎలాంటి డిప్రెషన్‌కి వెళ్తున్నారు, ఆ బాధను ఎలా హ్యాండిల్ చేస్తున్నారనేది ఆసక్తికరంగా చూపించబోతున్నాం. పేరెంట్స్‌కి కూడా ఇదొక మంచి మెసేజ్‌లా ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ ఎంత స్పీడ్‌గా ప్రేమలోకి వెళ్తున్నారో అంతే స్పీడ్‌గా విడిపోతున్నారు.
అజయ్ దిషన్, ధనుషా జోడీతోపాటు మంచు లక్ష్మి, సునీల్ పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఇక ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా మేము నిర్మిస్తున్న సినిమా పూర్తయింది. అలాగే ‘100 దేవుళ్ళు’ సినిమా మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు.
