ఆర్ఆర్ఆర్ మేకింగ్ అదరహో.. దసరాకు రిలీజ్ ఫిక్స్

ఆర్ఆర్ఆర్ మేకింగ్ అదరహో.. దసరాకు రిలీజ్ ఫిక్స్

హైదరాబాద్: దిగ్దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో స్టార్ హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్‌ మేకింగ్ వీడియో విడదలైంది. ఈ యాక్షన్ వీడియోలో జక్కన్నతోపాటు మూవీకి వర్క్ చేసిన టెక్నికల్ టీమ్‌ ఎక్కువ సేపు కనిపిస్తారు. వీరితోపాటు సినిమాలో లీడ్ రోల్స్ చేసిన తారక్, చెర్రీ, అలియా భట్, శ్రియా, అజయ్ దేవగణ్‌, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ, ఒలీవియా మోరిస్‌ను వీడియోలో చూడొచ్చు. తమ సీన్లకు సంబంధించిన కసరత్తులు చేస్తూ ఎలాంటి పాత్రల్లో అలరించనున్నారో కూడా వీడియోలో ఉంది. 

ఈ మూవీ కోసం పెద్ద ఎత్తున సెట్స్ నిర్మించామని వీడియోతో మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఈ మేకింగ్ వీడియో ద్వారా ఆర్‌ఆర్ఆర్‌ను ముందు ప్రకటించినట్లుగానే దసరా కానుకగా అక్టోబర్ 13న థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఫైనల్ దశలో ఉన్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ మరికొన్ని పూర్తవుతుందని తెలుస్తోంది. ఇకపోతే.. భారీ తారాగణం, విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణానికి రూ.450 కోట్ల వరకు ఖర్చయినట్లు సమాచారం.