
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ నేతృత్వంలో ఈ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఇరవై రోజుల పాటు చిత్రీకరించనున్నారట.
ఈ సీన్స్ కోసం ఎన్టీఆర్ గత కొద్దిరోజులుగా ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడని టాక్. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో యాక్షన్ సీన్స్ ఎక్కువగా వాటర్‌లోనే తీస్తున్నారు. షూటింగ్ మొదలైన రోజు నుంచి ఎక్కువగా యాక్షన్ సీన్స్‌పైనే ఫోకస్ పెట్టిన దర్శకుడు కొరటాల.. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక టాకీ పార్ట్, సాంగ్స్ పై దృష్టి సారించనున్నాడు. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా విడుదల కానుంది.