Jr. NTR : 'ఎస్కైర్ ఇండియా' కవర్‌పై జూనియర్ ఎన్టీఆర్.. వారసత్వం కాదు, నిజాయితీ ముఖ్యమంటున్న తారక్

Jr. NTR : 'ఎస్కైర్ ఇండియా' కవర్‌పై జూనియర్ ఎన్టీఆర్..  వారసత్వం కాదు, నిజాయితీ ముఖ్యమంటున్న తారక్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ ( Jr. NTR).  'స్టూడెంట్ నెంబర్ 1' తో హీరోగా తన కెరీర్ మొదలు పెట్టిన ఆయన... RRR మూవీతో ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమనులను సొంతం చేసుకున్నారు.  ఆయన గెటప్, మాటతీరు, నటనలో ఉన్న చరిష్మా, పదునైన ఆలోచనలతో భారతదేశంలోని అత్యంత పెద్ద సినీ తారల్లో ఒకరని రుజువు చేసుకుంటున్నారు. ఒక శక్తివంతమైన సినీ వారసత్వ కుటుంబంలో జన్మించినప్పటికీ, ఆ వారసత్వంతో కాకుండా తనకంటూ ఒక గుర్తింపును సృష్టించుకోవాలన్న ఆసక్తి ఆయనలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూనే, ఎన్టీఆర్ తన మొదటి అంతర్జాతీయ మ్యాగజైన్ 'ఎస్కైర్ ఇండియా' ( Esquire India ) ఆగస్టు సంచిక కవర్ పేజీపై మెరిశారు.

 ‘ఎస్కైర్ ఇండియా ’ సంచిక కవర్ పేజీపై మెరుపులు
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ( Jr. NTR), తొలిసారిగా ‘ఎస్కైర్ ఇండియా’ ఆగస్టు సంచికకు కవర్ పేజీపై కనిపించి అభిమానులను అలరిస్తున్నారు.  ఇటీవల నిర్వహించిన కవర్ షూట్‌లో ఎన్టీఆర్ దుబాయ్ స్కైలైన్ మధ్యలో, ఎత్తైన భవనాల ముందు నిలబడి ఆకర్షణీయంగా కనిపించారు. జుమేరా మార్సా అల్ అరబ్‌లోని ఓషన్ టెర్రేస్ సూట్‌లో ఈ ఫోటోషూట్ జరిగింది. ఇందులో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ALSO READ : Mahesh Babu: 'అతడు' రీ-రిలీజ్ హవా.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే హౌస్ ఫుల్

నిజాయితీపరుడిగా గుర్తుండిపోవాలి..
ఈ కవర్ షూట్ సందర్భంగా ‘ఎస్కైర్ ఇండియా’  మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన మనసులోని భావాలను పంచుకున్నారు.  "కుటుంబంలో చలనచిత్రాల వారసత్వం ఏమవుతుందో నాకు తెలియదు. దాని గురించి నేను ఏమీ ప్రణాళిక వేసుకోలేదు.  ప్రేక్షకుల హృదయాల్లో ఎల్లప్పుడూ నేను గుర్తుండిపోవాలనుకుంటున్నాను. కానీ అన్నిటికంటే ముఖ్యంగా, భావోద్వేగాలున్న ఒక నిజాయితీపరుడిగా నన్ను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను," అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"నేను ఎప్పుడూ ప్రణాళికలు వేసుకోని వ్యక్తిని. నాకు ఇష్టమైన కోట్స్‌లో ఒకటి కుంగ్ ఫూ పాండా నుండి వచ్చింది, అక్కడ ఊగ్వే చెప్పిన మాటలను గుర్తు చేస్తూ..  నిన్న చరిత్ర, రేపు ఒక రహస్యం కానీ ఈరోజు ఒక బహుమతి. అందుకే దానిని వర్తమానం అని పిలుస్తారు.' కాబట్టి, నా వర్తమానం ప్రస్తుతం నా దృష్టి. ఒక నటుడు ఎల్లప్పుడూ దేనికైనా సిద్ధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను అని ఎన్టీఆర్ చెప్పారు.

 

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ( Hrithik Roshan ), ఎన్టీఆర్ ( Jr. NTR ) కలిసి నటించిన 'వార్ 2' ( War 2 movie) మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.  అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.