డిసెంబర్ నుంచి నీల్ సెట్స్‌‌లో ఎన్టీఆర్

డిసెంబర్ నుంచి నీల్ సెట్స్‌‌లో ఎన్టీఆర్

మరో నెలలో ‘దేవర పార్ట్‌‌1’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఎన్టీఆర్.. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌‌లో నటించనున్నట్టు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్‌‌డేట్‌‌ను నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ తెలియజేశారు. అక్టోబర్ లేదా నవంబర్‌‌‌‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవనుందని, డిసెంబర్‌‌‌‌ నుంచి ఎన్టీఆర్ సెట్స్‌‌లో జాయిన్ అవుతారని ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘దేవర’ విడుదలైన తర్వాత కొన్ని  రోజులు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి, ప్రశాంత్ నీల్ మూవీ షూట్ స్టార్ట్‌‌ చేయాలనే ప్లాన్ చేస్తున్నాడట ఎన్టీఆర్.

 తన‌‌ కెరీర్‌‌‌‌లో ఇది 31వ సినిమా.  ‘డ్రాగన్‌‌’ అనే టైటిల్‌‌ ప్రచారంలో ఉంది.  ఎన్టీఆర్‌‌‌‌ ఆర్ట్స్‌‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌‌ సంస్థ నిర్మిస్తోంది. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు హిందీలో ‘వార్‌‌‌‌ 2’ మూవీలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.  ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది.