
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో నటనకు గానూ బెస్ట్ యాక్టర్ గా సైమా 2023 అవార్డును అందుకున్నారు. దుబాయ్ లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ ఈ ఆవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపాడు.
తనకు సపోర్ట్ గా నిలిచిన అభిమానులందరికీ పాదాభివందనం అని చెప్పాడు ఎన్టీఆర్. తాను కింద పడ్డప్పుడల్లా పట్టుకుని పైకి లేపినందుకు... తన కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా భాద పడినందుకు... తాను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు... అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు అని చెప్పుకొచ్చాడు.
ALSO READ: వైద్య విద్యలో తెలంగాణ నంబర్‌వన్ కరీంనగర్ మెడికల్ కాలేజీ ప్రారంభం
ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ సిటీలో అండర్ వాటర్ సీక్వెన్సులు, యాక్షన్ సీన్లు తీస్తున్నారు. జనతా గ్యారెజ్ తరువాత వీరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
‘సైమా’ 2023 అవార్డుల విజేతలు వీళ్లే!
- ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (ఆర్‌ఆర్‌ఆర్)
- ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
- ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్)
- ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్)
- ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్)
- ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
- ఉత్తమ విలన్: సుహాస్ (హిట్2)
- ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)
- ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్, అనురాగ్ (మేజర్)
- ఉత్తమ పరిచయ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
- ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్ (ఆర్‌ఆర్ఆర్)
- ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (నాటు నాటు)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (డీజే టిల్లు)
- ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)
- సెన్సేషన్‌ఆఫ్ ది ఇయర్ : నిఖిల్, కార్తికేయ2
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడవి శేష్ (మేజర్)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతారామం)
- ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్
- ప్రామిసింగ్ న్యూకమర్ (తెలుగు): బెల్లంకొండ గణేష్