Jr NTR: భారతీయ సినీ పితామహుడిగా ఎన్టీఆర్.. ఫాల్కే జీవితం ఆధారంగా మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

Jr NTR: భారతీయ సినీ పితామహుడిగా ఎన్టీఆర్.. ఫాల్కే జీవితం ఆధారంగా మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

ఆగస్టులో హృతిక్‌‌‌‌‌‌‌‌ రోషన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ‘వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్‌‌‌‌‌‌‌‌’లో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘దేవర 2’, నెల్సన్‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో సినిమా తెరకెక్కాల్సి ఉంది.

ఇంత బిజీలోనూ మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యాడట ఎన్టీఆర్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కీర్తించే దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ వెనుక రాజమౌళి హస్తం ఉండటం విశేషం.  

వివరాల్లోకి వెళితే.. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ ‘మేడ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ ఇండియా’పేరుతో రాజమౌళి రెండేళ్ల క్రితం ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ఆయన  సమర్పణలో కార్తికేయ, వరుణ్ గుప్తా (మ్యాక్స్‌‌‌‌‌‌‌‌ స్టూడియోస్‌‌‌‌‌‌‌‌) దీన్ని నిర్మించనున్నారు. ఫాల్కే జీవితం ఆధారంగా రూపొందే ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకుడు.

ఇటీవల ఈ మూవీ ఫైనల్ స్క్రిప్ట్ విని సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అయిన ఎన్టీఆర్, వెంటనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో ప్రచారం జరుగుతోంది. ఇదే కథతో ఆమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ కూడా లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో రాజ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిరానీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఫాల్కే బయోపిక్ రాబోతోందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్‌‌‌‌‌‌‌‌ తరణ్ ఆదర్శ్ బుధవారం ప్రకటించారు.

నాలుగేళ్లుగా ఈ స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌పై హిరాణీ వర్క్ చేస్తున్నారని, ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెట్స్‌‌‌‌‌‌‌‌కు వెళ్లబోతోందని తెలియజేశారు. ప్రస్తుతం ఫాల్కేగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క AI- జనరేట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి