
మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీతోపాటు బంధువులు, సన్నిహితులు హ్యాపీగా ఉన్నారు. రాంచరణ్ – ఉపాసన దంపతులకు ఆడ బిడ్డ పుట్టటంపై చెర్రీ ప్రాణ స్నేహితులు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. పేరంట్స్ క్లబ్ లోకి స్వాగతం.. బిడ్డతో గడిపే ప్రతి క్షణం జీవితాంతం మరిచిపోలేని జ్ణాపకంగా ఉంటుంది.. మిగిలిపోతుంది. దేవుడు ఆ బిడ్డను, మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ట్విట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.
పేరంట్స్ క్లబ్ లోకి స్వాగతం అంటూ చెర్రీ – ఉపాసనను ఉద్దేశించి ఎన్టీఆర్ చేసిన ట్విట్ వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగా అభిమానులు అయితే ప్రిన్సెస్ రాక సందర్భంగా పేదలకు పండ్లు పంచి పెడుతున్నారు. పిల్లలకు స్వీట్స్, చాక్లెట్లు పంచి పెడుతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఉన్న ఉపాసన, బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని.. పాపను చూసుకుంటూ మురిసిపోతున్నారని ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.