రివేంజ్ డ్రామాలో జూ.ఎన్టీఆర్

V6 Velugu Posted on Nov 24, 2021

‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ ప్యాన్ ఇండియా మూవీని రీసెంట్‌గా కంప్లీట్ చేసిన ఎన్టీఆర్, వెకేషన్‌ కోసం ఫ్యామిలీతో కలిసి యూరప్​ వెళ్లాడు. జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది కాబట్టి తిరిగి రాగానే ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌లో బిజీ అవుతాడు. ఈ సినిమా కోసం ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు తారక్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ జానర్‌‌లో ఉండబోతోంది అనే ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ విషయాలపై ఓ క్లారిటీ వచ్చేసింది.  ఫిబ్రవరి నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. దీన్ని రివెంజ్‌ డ్రామాగా రూపొందించబోతున్నాడట కొరటాల శివ.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌‌ స్వయంగా ఈ డిటెయిల్స్‌ రివీల్ చేశాడు. అంతేకాదు.. శివ సినిమా తర్వాత తను నటించబోయే మూవీపై కూడా తారక్ క్లారిటీ ఇచ్చేశాడు.  ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్​టైనర్​ చేయడానికి ఎన్టీఆర్​ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇది ‘కేజీఎఫ్‌’ రేంజ్‌ మూవీ అని, వచ్చే యేడు అక్టోబర్‌‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఎన్టీఆర్ చెప్పాడు. ఈ లెక్కన సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’తో వస్తున్న ఎన్టీఆర్, దసరా టైమ్‌కి కొరటాల శివ సినిమాతో వచ్చి, దీపావళి నుంచి ప్రశాంత్ నీల్‌ సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నాడు. మొత్తానికి వచ్చే యేడు ఎన్టీఆర్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నట్టే.  

Tagged JrNTR, Koratala Siva, Jr NTR new movie, tollywood news

Latest Videos

Subscribe Now

More News