పాన్ ఇండియా స్టార్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ఇవాళ (మే 20) తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు “మ్యాన్ ఆఫ్ మాసెస్”కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడిగా అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకున్న ఎన్టీఆర్, తన కష్టంతో భారీ ఆస్తులను కూడా సంపాదించుకున్నారు. పలు నివేదికల ప్రకారం, ఎన్టీఆర్ అంచనా నికర ఆస్తి విలువ దాదాపు రూ.500 నుంచి 600 కోట్లుపైనే ఉంటుందని టాక్. ఈ నేపథ్యంలోనే ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యంత రిచెస్ట్ నటులలో తారక్ ఒకరిగా గుర్తింపు పొందారు.
ఎన్టీఆర్ సంపాదనకు మెయిన్ సోర్సెస్: సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, వ్యాపార రంగాల పెట్టుబడులు. అలాగే, RRR వంటి ఆస్కార్ స్థాయి సినిమాతో వచ్చిన గుర్తింపు తారక్ ఆదాయాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఒక్కో సినిమాకు ఎన్టీఆర్ సుమారు రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దేశంలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఎన్టీఆర్ ఒకరిగా కొనసాగుతున్నారు.
జూబ్లీ హిల్స్‌లో విలాసవంతమైన బంగ్లా..
ఎన్టీఆర్‌కు హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీ హిల్స్‌లో ఒక విలాసవంతమైన బంగ్లా ఉంది. ఈ ఇంటి విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా.
ప్రైవేట్ జెట్, లగ్జరీ కార్ల కలెక్షన్..
సినీ సెలబ్రిటీల లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఖరీదైన విల్లాలు, బ్రాండెడ్ వస్తువులు, విదేశీ పర్యటనలు వారి జీవనశైలిలో భాగమైపోయాయి. ఈ క్రమంలో ప్రైవేట్ జెట్ కలిగిన కొద్దిమంది భారతీయ నటుల్లో ఎన్టీఆర్ కూడా ఒకరని సమాచారం. దీని విలువ సుమారు రూ.80 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఆయన గ్యారేజ్‌లో BMW, Mercedes-Benz, Porsche, Lamborghini వంటి లగ్జరీ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ కూడా కోట్లల్లో ఉంటుందని సమాచారం.
బ్రాండ్ ఇమేజ్తో ఇన్కమ్ డబుల్..
ఎన్టీఆర్ అనేక ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కూడా ఆయన వార్షిక ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నటనతో పాటు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి పలు ఆదాయ మార్గాలను సృష్టించుకున్నారు. 3 దశాబ్దాల విజయవంతమైన కెరీర్‌తో ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత టాప్ రిచెస్ట్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా వచ్చిన ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదలై అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది.
విలాసవంతమైన ఫామ్‌హౌస్
2021లో ఎన్టీఆర్ హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లి మండలం, గోపాలపురం గ్రామంలో సుమారు 6.5 ఎకరాల విస్తీర్ణంలో ‘బృందావనం’ పేరుతో ఓ విలాసవంతమైన ఫామ్‌హౌస్ కొనుగోలు చేశారు. అందమైన పచ్చని తోటలు, విశాలమైన ప్రదేశంతో ఆకట్టుకునే ఈ ఫామ్‌హౌస్‌ను ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.
లగ్జరీ వాచ్‌ల కలెక్షన్
ఎన్టీఆర్ కు ఖరీదైన వాచ్‌లపై ప్రత్యేక ఆసక్తి ఉందని తెలిసిందే. గతేడాది వైరల్ అయిన అరుదైన రిచర్డ్ మిల్ RM 40-01 టూర్బిలియన్ మెక్‌లారెన్ స్పీడ్‌టైల్ తారక్ వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని విలువ సుమారు రూ.7.47 కోట్లు ఉంటుందని సమాచారం.
అంతేకాకుండా ఎన్టీఆర్ వద్ద ఆడెమర్స్ పిగెట్కు చెందిన సుమారు రూ.2.1 కోట్ల విలువైన వాచ్, అలాగే పటెక్ ఫిలిప్ నాటిలస్ 40 మి.మీ. మోడల్ వాచ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీని విలువ దాదాపు రూ.2.5 కోట్లు ఉంటుంది. ఇలా ఎన్టీఆర్ లగ్జరీ వాచ్‌ల కలెక్షన్ కూడా ఆయన రాయల్ లైఫ్‌స్టైల్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
