JSW సిమెంట్ లాభం రూ. 75.36 కోట్లు

JSW సిమెంట్ లాభం రూ. 75.36 కోట్లు

న్యూఢిల్లీ: జేఎస్‌‌డబ్ల్యూ సిమెంట్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.75.36 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అమ్మకాల పరిమాణం రెండంకెల వృద్ధి సాధించడం ఇందుకు కారణం. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 75.82 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,436.43 కోట్లుగా నమోదైంది. గత ఏడాది రూ. 1,223.71 కోట్లు వచ్చాయి. మొత్తం అమ్మకాల పరిమాణం రెండో క్వార్టర్​లో 3.11 ఎం​టీ (మిలియన్ టన్నులు) గా ఉంది. గత ఏడాది రెండో క్వార్టర్​లో ఇది 2.71 ఎంటీలుగా ఉంది.

2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో (హెచ్1) మొత్తం ఆదాయం రూ. 3,041.93 కోట్లు. 2025 సెప్టెంబర్ 30 నాటికి నికర అప్పు రూ. 3,231 కోట్లుగా ఉంది. ఐపీఓ నిధులు రావడంతో అప్పు గణనీయంగా తగ్గింది. కంపెనీ తన విస్తరణ కోసం 509 కోట్ల రూపాయల కాపెక్స్‌‌ను (మూలధన వ్యయం) పెట్టుబడిగా పెట్టింది. సౌరశక్తిని కొనుగోలు చేయడానికి జేఎస్​డబ్ల్యూ గ్రీన్ ఎనర్జీ ఫిఫ్టీన్ లిమిటెడ్​లో 26 శాతం వాటాను కొనుగోలు చేయడానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది.