తెలంగాణ మార్కెట్ లో సరికొత్త ఎంజీ మెజస్టర్

తెలంగాణ మార్కెట్ లో సరికొత్త ఎంజీ మెజస్టర్

హైదరాబాద్​, వెలుగు: జేఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ ఎమ్‌‌‌‌‌‌‌‌జీ మోటార్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సరికొత్త డీ ప్లస్ ఎస్​యూవీ మెజస్టర్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసింది. ఈ కారులోని డీజిల్ ఇంజన్ 215.5 పీఎస్ పవర్, 478.5 ఎన్ఎమ్ టార్క్‌‌‌‌‌‌‌‌ను అందిస్తుంది.  టూ వీల్ డ్రైవ్ టాప్ ట్రిమ్ ధర రూ. 40.99 లక్షలు కాగా, ఫోర్ వీల్ డ్రైవ్ టాప్ ట్రిమ్ ధర రూ. 44.99 లక్షలుగా ఉంది. ఇందులో 10 ఆఫ్-రోడ్ మోడ్స్, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ , పనోరమిక్ సన్‌‌‌‌‌‌‌‌రూఫ్, 12 జేబీఎల్ స్పీకర్లు ఉన్నాయి.  కస్టమర్లు 70 శాతం వరకు అష్యూర్డ్ బైబ్యాక్ విలువను పొందవచ్చని ఎల్​బీ నగర్​లోని పీపీఎస్​ఎంజీ షోరూమ్​తెలిపింది.