కొమురవెల్లి, వెలుగు: శ్రీమల్లికార్జునస్వామిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదం ఇచ్చి సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ఇంటి దైవమైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్, కిసాన్ సెల్ అధ్యక్షుడు బొచ్చు ఎల్లయ్యయాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏర్పుల రాజు, మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి, యూత్ సెక్రటరీలు పాల్గొన్నారు.
