బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు

బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు

జూబ్లీహిల్స్, వెలుగు: బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బిగ్ బాస్ సీజన్–7 విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు కొంతమంది ఈ నెల 19న స్టూడియో వద్ద అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆరు ఆర్టీసీ బస్సులు, పంజగుట్ట ఏసీపీ వెహికల్, మరో బెటాలియన్ వాహనం, రెండు ప్రైవేట్ కార్లను ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పల్లవి ప్రశాంత్ సహా 21 మందిని అరెస్టు చేశారు. కాగా, పల్లవి ప్రశాంత్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.