నేటితో ముగియనున్న ముగ్గురు మైనర్ల విచారణ

నేటితో ముగియనున్న ముగ్గురు మైనర్ల విచారణ

జూబ్లీహిల్స్ పబ్  కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.  ఇందులో భాగంగా  ఈరోజు(మంగళవారం) మొత్తం ఐదుగురు మైనర్లను కలిపి విచారణ చేయనున్నారు. ఉదయం 10 గంటల  నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది.  ఘటన ఎలా జరిగింది ? అనే దానిపై ఇప్పటివరకు పోలీసులు వివరాలను సేకరించారు. విచారణలో భాగంగా మైనర్లతో పాటు కొందరు వ్యక్తులు చెప్పిన స్టేట్మెంట్లను రికార్డు చేశారు. కేసుతో ముడిపడిన సాంకేతిక, వైద్యపరమైన, శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించారు. ముగ్గురు మైనర్ల పోలీసు కస్టడీ గడువు నేటితో ముగియనుండగా, మరో ఇద్దరి గడువు రేపటితో ముగియనుంది.