జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ కొనసాగుతోంది. నవంబర్ 11న మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందకు ఓటర్లు క్యూ కడుతున్నారు.
షేక్ పేట డివిజన్ లోని ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఎల్లారెడ్డి గూడా శ్రీ కృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నెంబర్–290లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
