జూన్ 24 నుంచి జూడాల సమ్మె

జూన్ 24 నుంచి జూడాల సమ్మె

వరంగల్​సిటీ, వెలుగు : తమ డిమాండ్లను నెరవేర్చడంతో పాటు హక్కుల సాధనకు జూన్ 24 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు వరంగల్‌‌‌‌‌‌‌‌లోని జూనియర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్లు, కేఎంసీ స్టూడెంట్లు ప్రకటించారు. ఈ మేరకు కేఎంసీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌కు శుక్రవారం సమ్మె నోటీసు అందజేశారు. సమస్యలు తీరేంత వరకు సమ్మేను విరమించేది లేదని ప్రకటించారు. 

స్టైఫండ్‌‌‌‌‌‌‌‌ విడుదల చేయాలని, కాకతీయ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో రోడ్లు వేయాలని, డాక్టర్ల కోసం కొత్త హాస్టల్స్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌ నిర్మించాలని, సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ సీనియర్‌‌‌‌‌‌‌‌ రెసిడెంట్స్‌‌‌‌‌‌‌‌ కోసం సవరించిన గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ నెల 24లోపు డిమాండ్లు పరిష్కరించకపోతే, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.