సాగర్​ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలి : జూలకంటి రంగారెడ్డి

సాగర్​ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలి : జూలకంటి రంగారెడ్డి

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ద్వారా నీటిని విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం నల్గొండ జిల్లా అనుముల మండలం సూరేపల్లి మేజర్ వద్ద హాలియా, మిర్యాలగూడ జాతీయ రహదారిపై రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాగర్​ఆయకట్టు కింద ఎడమ కాల్వను నమ్ముకొని 30 శాతం మంది రైతులు వరి సాగు చేశారని, నీళ్లు అందడకపోవడంతోఎండిపోయే దశకు చేరిందని వాపోయారు. ఆయకట్టు ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలతో పాటు బోర్లు కూడాఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడమ కాలువ ద్వారా 15 టీఎంసీల నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపి..పంటలను కాపాడాలని కోరారు.

వారబందిగానైనా నీటిని విడుదల చేయాలని ఇప్పటికే సీఎం, ఇరిగేషన్‌‌‌‌ మంత్రికి వినతిపత్రం ఇచ్చామని గుర్తుచేశారు. ప్రాజెక్టులో విడుదలకు సరిపడా నీళ్లు లేకపోతే కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేయించాలని కోరార. రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, కూన్ రెడ్డి నాగిరెడ్డి, కేవీపీఎస్​ జిల్లా అధ్యక్షుడుకొండేటి శ్రీను, నేతలు కందుకూరు కోటేశ్, కోమండ్ల గురువయ్య, నలబోతు సోమయ్య, మలికంటి చంద్రశేఖర్, కుంచెం శేఖర్, రైతులు రావుల ముసలయ్య, నరసింహ,జానపాటి సైదయ్య, సింగడిశెట్టి నాగయ్య, కొండేటి సైదయ్య, ఆంజనేయులు, కొండేటి నాగయ్య, చారి, రవితేజ పాల్గొన్నారు.