పటాన్చెరువు నుంచి తిరుపతికి మహా పాదయాత్ర .. ప్రారంభించిన నీలం మధు

పటాన్చెరువు నుంచి తిరుపతికి మహా పాదయాత్ర .. ప్రారంభించిన నీలం మధు

రామచంద్రాపురం/పటాన్​చెరు, వెలుగు:  సంగారెడ్డి జిల్లా పటాన్​చెరువు నుంచి తిరుపతికి మహా పాదయాత్ర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. పటాన్ ​చెరువు పట్టణానికి చెందిన సీసల రాజు 20  ఏళ్లుగా ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. పటాన్ చెరువులోని మహంకాళీ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగుతుంది. ఈసారి 21వ పాదయాత్రను కాంగ్రెస్​ సీనియర్​ నేత నీలం మధు ముదిరాజ్​ మంగళవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీసల రాజును, పాదయాత్ర బృందాన్ని ఆయన ఘనంగా సత్కరించారు. పాదయాత్ర రామచంద్రాపురం చేరుకోగానే గండమ్మ గుడి వద్ద జిల్లా మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్​ గౌడ్​ సీసల రాజు బృందాన్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.