హాకీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియాకు ఓటమి

 హాకీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియాకు ఓటమి

కౌలాలంపూర్‌ ‌‌‌: ఎఫ్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ మెన్స్‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియాకు ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన పూల్‌‌‌‌–సి రెండో మ్యాచ్‌‌‌‌లో ఇండియా 1–4తో స్పెయిన్‌‌‌‌ చేతిలో ఓడింది. స్పెయిన్‌‌‌‌ తరఫున కాబ్రే వెర్డెల్‌‌‌‌ పోల్‌‌‌‌ (1, 14వ ని.), రఫీ అండ్రియాస్‌‌‌‌ (18, 60వ ని.) గోల్స్‌‌‌‌ చేయగా, రోహిత్‌‌‌‌ (33వ ని.) ఇండియాకు ఏకైక గోల్‌‌‌‌ అందించాడు. తొలి మ్యాచ్‌‌‌‌లో కొరియాపై అద్భుత విజయం సాధించిన ఇండియా ఈ పోరులో ఆ మ్యాజిక్‌‌‌‌ను రిపీట్‌‌‌‌ చేయలేకపోయింది. టెక్నికల్‌‌‌‌గా బలంగా ఉన్న స్పెయిన్‌‌‌‌ ఎదురుదాడులకు అడ్డుకట్ట వేయలేకపోయింది.

 రెండు వైపుల నుంచి అటాకింగ్‌‌‌‌ గేమ్‌‌‌‌ ఆడిన స్పెయిన్​ తొలి నిమిషంలోనే గోల్‌‌‌‌ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. మధ్యలో మిడ్‌‌‌‌ ఫీల్డర్లను రొటేట్‌‌‌‌ చేసిన ఇండియా అగ్రెసివ్‌‌‌‌ గేమ్‌‌‌‌ ఆడటంలో ఫెయిలైంది. సర్కిల్‌‌‌‌లోకి దూసుకుపోవడంలోనూ ఇండియన్‌‌‌‌ ఫార్వర్డ్స్‌‌‌‌ వెనకబడ్డారు. దీంతో 33వ నిమిషం తర్వాత వచ్చిన రెండు పెనాల్టీలను వృధా చేశారు. ఓవరాల్‌‌‌‌గా ఈ గ్రూప్‌‌‌‌లో స్పెయిన్‌‌‌‌ ఆరు పాయింట్లతో టాప్‌‌‌‌లో ఉండగా, కొరియా, ఇండియా చెరో 3 పాయింట్లతో తర్వాతి ప్లేస్‌‌‌‌ల్లో ఉన్నాయి. శనివారం జరిగే ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా.. కెనడాతో తలపడుతుంది.