
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ప్రేక్షకులంతా ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలో ఎన్టీఆర్ ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొరటాల శివ మూవీలో నటించనున్నాడు తారక్. ఇందులో ఆలియాభట్ హీరోయిన్‌గా నటించనుంది. ఇదిలా ఉంటే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను ఏప్రిల్ 11న ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి ‘పెద్ది’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఇప్పటికే చాలా టైమ్ కేటాయించిన ఎన్టీఆర్... ఈసారి ఎక్కువ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇందుకోసం కొరటాల శివ సినిమాతో పాటు బుచ్చిబాబు సినిమాను ఒకే టైమ్‌లో కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట.