డ్రమ్స్ లేవు.. కాస్ట్యూమ్స్ లేవు.. దసరాకి రిలీజ్‌‌‌‌ అంటున్నారు

డ్రమ్స్ లేవు.. కాస్ట్యూమ్స్ లేవు.. దసరాకి రిలీజ్‌‌‌‌ అంటున్నారు

రిలీజ్ దగ్గరపడేకొద్దీ సినిమాని రకరకాల పద్ధతుల్లో ప్రమోట్ చేస్తుంటాయి టీమ్స్. అయితే ‘ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌’ టీమ్ రూటే వేరుగా ఉంది. ఆల్రెడీ 
ప్రమోషనల్‌‌‌‌ సాంగ్‌‌‌‌తో ఇంప్రెస్ చేశారు. ఇప్పుడు షూట్ అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ ఇస్తూ అలరిస్తున్నారు. వాటిని రివీల్ చేసే బాధ్యత స్వయంగా ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ తీసుకోవడం విశేషం. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్‌‌‌‌లో జరుగుతోంది. ఫైనల్‌‌‌‌ సాంగ్‌‌‌‌ తీస్తున్నారు. షూట్‌‌‌‌ గ్యాప్‌‌‌‌లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్​ని ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో షేర్​ చేస్తున్నాడు తారక్. ఆగస్ట్ 9 నుండి ‘ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌’ ఇన్‌‌‌‌స్టా అకౌంట్‌‌‌‌ని ఎన్టీఆర్ టేకోవర్ చేస్తున్నాడని ముందుగానే అనౌన్స్ చేశారు. చెప్పినట్టుగానే నిన్న తనో వీడియోని పోస్ట్ చేశాడు. అందులో ‘డ్రమ్స్ ప్రాక్టీస్ అయ్యిందా’ అని చరణ్‌‌‌‌ని ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ అడిగాడు. చరణ్ టేబుల్‌‌‌‌పై దరువేసి అయిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత ‘డ్రమ్స్ లేవు. కాస్ట్యూమ్స్ లేవు. పొద్దున్నే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దసరాకి రిలీజ్‌‌‌‌ అంటున్నారు’ అంటూ ఎదురుగా ఉన్న కార్తికేయని అడుగుతున్నాడు చరణ్. ఈ వీడియో సోషల్‌‌‌‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అక్టోబర్ 13న సినిమాని విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ కన్‌‌‌‌ఫర్మ్ చేశారు. షూట్​ పూర్తి కావస్తుండటంతో ఇలా కొత్త పద్ధతిలో ప్రమోషన్ 
మొదలుపెట్టారు. అజయ్ దేవగన్, ఆలియా భట్, శ్రియ, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నారు.