అవన్నీ కల్పితం.. Jr. NTR రోడ్డు ప్రమాదంలో గాయపడలేదు: ఎన్టీఆర్ టీమ్

అవన్నీ కల్పితం.. Jr. NTR రోడ్డు ప్రమాదంలో గాయపడలేదు: ఎన్టీఆర్ టీమ్

తెలుగు సినీ హీరో, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రితో చికిత్స పొందుతున్నట్లు బుధవారం(ఆగష్టు 14) ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, అవన్నీ కల్పితమని ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన చేసింది. 

కొద్దిరోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా మణికట్టుకు గాయమైందని అతని టీమ్ తెలిపింది. ఆ గాయం నుంచి అతను వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడించింది.   
  
"జూనియర్ ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు ఎడమ చేతి మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా చేతికి బ్యాండేజ్ వేశారు. గాయపడినప్పటికీ ఎన్టీఆర్ గత రాత్రి దేవర షూటింగ్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతానికి అతను కోలుకుంటున్నాడు. దయచేసి ఈ చిన్న గాయానికి ఊహాగానాలు ప్రచారం చేయకండి.." అని ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన చేసింది.