బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది..

బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పదేళ్ల పాలనలో గ్రామాలు, తండాల్లో సౌకర్యాలు లేవని అభివృద్ధి శూన్యమని అన్నారు. ఎల్లారం తండాకు ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎంపీ వచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. కామారెడ్డి జిల్లాలోని  కౌలాస్ కోటను అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రెండు హామీలు నెరవేర్చారని జూపల్లి అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకే ప్రజా పాలనలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. దశల వారీగా మిగితా హామీలను అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకు ప్రజా పాలన తెచ్చామని జూపల్లి కృష్ణారావు చెప్పారు.