జూరాల ప్రాజెక్ట్‌‌ గేట్లు క్లోజ్

జూరాల ప్రాజెక్ట్‌‌ గేట్లు క్లోజ్

గద్వాల, వెలుగు : కర్ణాటక నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్ట్‌‌ గేట్లను ఆదివారం రాత్రి క్లోజ్‌‌ చేశారు. జూరాలలో ప్రస్తుతం 317.820 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి విద్యుత్‌‌ ఉత్పత్తి కోసం 38,180 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్- 1కు 1,300, నెట్టెంపాడు లిఫ్ట్‌‌కు 750, కోయిల్‌‌సాగర్‌‌ లిఫ్ట్‌‌కు 315, లెఫ్ట్‌‌ కెనాల్‌‌కు 1,030, రైట్‌‌ కెనాల్‌‌కు 470, ఆర్డీఎస్‌‌ లింక్‌‌ కెనాల్‌‌కు 150, సమాంతర కాల్వకు 950, బీమా లిఫ్ట్‌‌ -2కు 750 క్యూసెక్కులతో కలిసి మొత్తం 42,390 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

550 అడుగులకు సాగర్‌‌

హాలియా : శ్రీశైలం క్రస్ట్‌‌ గేట్లను మూసివేయడంతో సాగర్‌‌కు వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలం నుంచి విద్యుత్‌‌ ఉత్పత్తి ద్వారా 62,983 క్యూసెక్కుల నీరు సాగర్‌‌కు వస్తోంది. సాగర్‌‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.040 టీఎంసీలు) కాగా.. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 550.40 అడుగుల (210.6602 టీఎంసీలు) వరకు నీరు చేరింది. సాగర్‌‌ నుంచి ఏఎమ్మార్పీకి 1,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.